ఇంట్లో వైఫై పోయిందంటే…
ఒక సాధారణ మధ్యతరగతి ఇల్లు.
రాత్రి 8 గంటలు.
నాన్న ఫోన్‌లో వీడియో చూస్తున్నారు.
అమ్మ సీరియల్ క్లిప్స్ చూస్తోంది.
కొడుకు గేమింగ్‌లో బిజీ.
కూతురు రీల్స్ స్క్రోల్ చేస్తోంది.
ఇంట్లో నలుగురు ఉన్నారు.
కానీ నిశ్శబ్దం.
అందరూ ఒకే ఇంట్లో ఉన్నా…
ఎవ్వరూ ఎవ్వరితో లేరు.
అంతలో…
వైఫై పోయింది!
ఒక్కసారిగా ఇంట్లో కలకలం.
“నెట్ వస్తుందా?”
“రౌటర్ ఆఫ్ చేసి ఆన్ చేశావా?”
“డేటా కూడా స్లోగా ఉంది!”
అంటూ ఎమర్జెన్సీ మీటింగ్.
15 నిమిషాల తర్వాత…
ఇంకా నెట్ రాలేదు.
నెట్ రాకపోవడంతో…
అందరూ హాల్లో కూర్చున్నారు.
మొదట్లో కొంచెం ఇబ్బందిగానే అనిపించింది.
ఎందుకంటే…
ఇంట్లో వాళ్లతో మాట్లాడటం కంటే ఫోన్‌తో మాట్లాడటం అలవాటైపోయింది!
కానీ కాసేపటికి మాటలు మొదలయ్యాయి.
అందరూ కలిసి భోజనం చేస్తుంటే
నాన్న తన చిన్నప్పటి కథలు చెప్పాడు.
అమ్మ పాత జ్ఞాపకాలు గుర్తు చేసింది.
పిల్లలు స్కూల్, కాలేజీ సంగతులు చెప్పారు.
నవ్వులు.
ఆటపాటలు.
చిన్న చిన్న వాదనలు.
చాలా రోజుల తర్వాత…
ఇంట్లో నిజంగా “ఇల్లు” ఉన్నట్టుగా అనిపించింది.
అప్పుడు నాన్న ఒక్కసారిగా అన్నాడు…
“అసలు మనం ఏమైపోయామో తెలుసా?
ఒకే ఇంట్లో ఉంటూ…
ఒకరికొకరం మెసేజ్‌లు పంపుకుంటున్నాం కానీ మాట్లాడుకోవడం లేదు.
ఇలా అందరం కలిసి కూర్చుని మాట్లాడుతుంటే ఎంత బాగుందో!
ఇక నుంచి రోజూ ఒక గంట ఇలా ఫోన్లు పక్కన పెట్టి కూర్చుందాం.”
అమ్మ వెంటనే…
“అవును!”
అంది.
పిల్లలు కూడా…
“సూపర్ ఐడియా!”
అన్నారు.
అందరూ అంగీకరిస్తుండగానే…
టింగ్!
టింగ్!
టింగ్!
టింగ్!
వైఫై మళ్లీ వచ్చేసింది.
ఒక్కసారిగా అందరి ఫోన్లు నోటిఫికేషన్లతో మోగిపోయాయి.
ఐదు నిమిషాల తర్వాత…
నాన్న YouTubeలో.
అమ్మ WhatsAppలో.
కొడుకు గేమ్‌లో.
కూతురు రీల్స్‌లో.
హాల్లో మళ్లీ నిశ్శబ్దం.
😄😄😄
మనతారా LOL పాఠం:
కుటుంబాన్ని కలపడానికి కొన్నిసార్లు పెద్ద పండుగలు అవసరం లేదు…
ఒక్క WiFi outage చాలు!