లవ్ రూమర్స్‌పై నోరు విప్పిన భాగ్యశ్రీ బోర్సే.. ఎనర్జిటిక్ స్టార్‌తో డేటింగ్ నిజమేనా?
CelebrityGossip
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రామ్ పోతినేని లవ్ లైఫ్ గురించి సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. తాజాగా ఈ చాక్లెట్ బాయ్.. టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ భాగ్యశ్రీ బోర్సేతో లవ్‌లో ఉన్నాడంటూ నెట్టింట ప్రచారం ఊపందుకుంది. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఒక సినిమా రాబోతోందనే వార్తలతో పాటు ఈ రూమర్స్ కూడా తోడయ్యాయి.
ఈ లవ్ అఫైర్ వార్తలపై రీసెంట్‌గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో భాగ్యశ్రీకి డైరెక్ట్ ప్రశ్న ఎదురైంది. దానికి ఆమె నేరుగా అవునని చెప్పకపోయినా, నవ్వుతూ సమాధానాన్ని దాటవేసిన విధానం చూసి నెటిజన్లు రకరకాలుగా గెస్ చేస్తున్నారు. ఆ ‘బ్లషింగ్’ వెనుక ఏదో నిజం ఉందంటూ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. మరి ఈ క్రేజీ లవ్ స్టోరీ కేవలం గాసిప్‌కే పరిమితమా లేక నిజంగానే వీరిద్దరూ త్వరలో గుడ్ న్యూస్ చెబుతారా అనేది చూడాలి.